తమిళ్ కన్నా తెలుగే ముద్దు అంటున్న తాప్సి

0
204

తమిళ్ కన్నా తెలుగే ముద్దు అంటున్న తాప్సి
‘ఝుమ్మంది నాదం’ తో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన పంజాభి భామ తాప్సికి కోలివుడ్ కన్నా టాలివుడ్ లోనే మంచి పాత్రలు వస్తాయట. తమిళ్ లో వచ్చే అవకాశాలకు తన కేరెక్టర్ ఇంపార్టెన్స్ తక్కువ ఉందని, అందుకే తమిళ్ కన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటున్నట్లు à°“ ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చింది à°ˆ ముద్దు గుమ్మ.
నటనలో ఎటువంటి శిక్షణ తీసుకోక పోయిన , నాలుగేళ్ళ వయస్సు నుంచే కథక్ నేర్చుకుని స్టేజ్ షోలు ఇవ్వటం వల్ల తనకు స్టేజ్ ఫియర్ లేదంట. అందుకే ఈజిగా పాత్రలోకి ఇమిడిపోతున్నా అని గొప్పగా చెప్పుకుంటుంది చొట్ట బుగ్గల తాప్సి .
హీరోయిన్ అంటేనే అందాలు ఆరబోయటం సహజమని అది నేనైనా ఎవరైనా తప్పదని, తను చేసే ఎక్స్ పోసింగ్ పై గడుసుగా తప్పించుకుంటుంది. ఇప్పుడు తన చేతిలో ‘విక్టరి’ వెంకటేష్ తో ‘షాడో’, గోపీచంద్ తో మాస్ ఎంటర్ టైనర్ సినిమాలు వున్నాయట, వాటి విజయాల కోసం బాగా ఎదురు చూస్తోంది à°ˆ సొగసుల చిన్నది. >

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.